తెలంగాణ

telangana

ETV Bharat / state

మహబూబాబాద్ కలెక్టర్ కార్యాలయం ఎదుట భూ నిర్వాసితుల ధర్నా - land expats protest at mahabubabad collectorate

సీతారామ ప్రాజెక్టు కింద మహబూబాబాద్ జిల్లాలో భూములు కోల్పోతున్న రైతులకు న్యాయం చేయాలంటూ జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు రావిగూడెం రైతులు ధర్నా నిర్వహించారు. తమకు జీవనాధారంగా ఉన్న భూములను బలవంతంగా లాక్కోవద్దని వారు కలెక్టర్​కు విజ్ఞప్తి చేశారు.

seetaram-project-land-expats-protest-at-mahabubad
మహబూబాబాద్ కలెక్టర్ కార్యాలయం ఎదుట భూ నిర్వాసితుల ధర్నా

By

Published : Jul 29, 2020, 10:23 PM IST

మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలం రావిగూడెం రైతులు సీతారామ ప్రాజెక్టు కింద భూములు కోల్పోతున్నారు. వారికి న్యాయం చేయాలంటూ మహబూబాబాద్ కలెక్టరేట్ ఎదుట రైతులు ధర్నాకు దిగారు. తమ భూముల్లో సర్వే చేయొద్దని.. వాటిని బలవంతంగా లాక్కోవద్దని, తమకు న్యాయం చేయాలంటూ నినాదాలు చేశారు. అనంతరం తమ సమస్య పరిష్కరించాలంటూ కలెక్టర్​కు వినతిపత్రాన్ని సమర్పించారు.

అందనాలపాడు గ్రామంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ కులాలకు చెందిన రైతులే ఉన్నారని.. తమకు కేటాయించిన భూముల్లో వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నామని.. తమ భూములను బలవంతంగా లాక్కోవద్దని రైతులు విజ్ఞప్తి చేశారు. తప్పనిసరి పరిస్థితుల్లో తీసుకుంటే ఎకరానికి రూ. 50 లక్షల నష్టపరిహారం చెల్లించి, కుటుంబానికో ఉద్యోగమివ్వాలని వారు డిమాండ్ చేశారు.

ఇవీ చూడండి: కరోనాతో ఆర్టీసీకి తగ్గిన ఆదాయం.. పార్శిల్​పైనే ఆశలు

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details