మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ రైల్వే స్టేషన్లో సికింద్రాబాద్ డీఆర్ఎం ఆనంద్ భాటియా ఆకస్మిక తనిఖీ చేశారు. భద్రాచలం రైల్వే స్టేషన్ నుంచి ప్రత్యేక రైలులో డోర్నకల్ స్టేషన్ చేరుకుని రూట్ రిలే ఇంటర్ లాకింగ్ క్యాబిన్ పరిశీలించారు. అనంతరం రెండో నంబర్ ఫ్లాట్ ఫారం రైల్వే ట్రాక్‌కి అమర్చిన థిక్ వెబ్ స్విచ్ పాయింట్‌ని అధికారుల సమక్షంలో సందర్శించారు.
డోర్నకల్ రైల్వే స్టేషన్లో డీఆర్ఎం ఆకస్మిక తనిఖీలు
సికింద్రాబాద్ డీఆర్ఎం ఆనంద్ భాటియా డోర్నకల్ రైల్వే స్టేషన్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. రైల్వే ట్రాక్ యార్డ్ బుకింగ్ కార్యాలయం ఫుట్ ఓవర్ బ్రిడ్జ్, రన్నింగ్ రూమ్‌లను పరిశీలించారు. మార్గంమధ్యలో నూతనంగా నిర్మిస్తోన్న పోచారం రైల్వేస్టేషన్ పనులపై ఆరా తీశారు.
రైల్వే ట్రాక్ యార్డ్ బుకింగ్ కార్యాలయం, ఫుట్ ఓవర్ బ్రిడ్జ్, రన్నింగ్ రూమ్, క్రూ బుకింగ్ లాబీ, స్టేషన్ మాస్టర్ కార్యాలయం, రన్నింగ్ రూమ్, సిబ్బంది పనితీరుపై సమీక్షించారు. వసతి ఏర్పాట్ల వివరాలను అడిగి తెలుసుకున్నారు. స్టేషన్ సమీపంలోని ఆర్ ఈ క్వాటర్స్‌ను తొలగించాలని అధికారులను ఆదేశించారు. రూ.2 కోట్ల 50 లక్షలతో నూతనంగా నిర్మిస్తోన్న రన్నింగ్ రూమ్ పనులపై ఆరా తీసి... గడువులోగా పూర్తి చేయాలని సూచించారు. మార్గంమధ్యలో నూతనంగా నిర్మిస్తోన్న పోచారం రైల్వేస్టేషన్ పనులను పరిశీలించారు. ఈ తనిఖీల్లో అన్ని శాఖల రైల్వే ఉన్నతాధికారులు పాల్గొన్నారు.