రెండో విడత గొర్రెల పంపిణీని చేపట్టాలని డిమాండ్ చేస్తూ మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి మండలంలో గొర్రెలు, మేకల పెంపకం దారుల సంఘం ఆధ్వర్యంలో రాస్తారోకోలు నిర్వహించారు. రామానుజాపురం, బీరిశెట్టిగూడెం, పడమటిగూడెం గ్రామాల్లో ప్రధాన రహదారులపై గొర్రెలతో రహదారులను దిగ్భంధించి నిరసన తెలిపారు.
రెండో విడత గొర్రెలు పంపిణీ చేయాలని ఆందోళన - రహదారులపై బైఠాయించి నిరసన
మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ నియోజకవర్గ వ్యాప్తంగా రెండో విడత గొర్రెల పంపిణీ చేపట్టాలని డిమాండ్ చేస్తూ గొర్రెలు, మేకల పెంపకం దారుల సంఘం ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు. ప్రధాన రహదారులపై బైఠాయించి నిరసన తెలిపారు.
రెండో విడత గొర్రెలు పంపిణీ చేయాలని ఆందోళన
గొర్రెలు పంపిణీ చేయడంలో ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును నిరసిస్తూ నినాదాలు చేశారు. తక్షణమే రెండో విడత పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. ఆందోళనకు దిగిన జీఎంపీఎస్ నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు.
ఇదీ చూడండి :కాళేశ్వరం ప్రాజెక్టుపై దాఖలైన పిటిషన్లపై ఎన్జీటీలో ముగిసిన వాదనలు