మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలకేంద్రంలోని అంబేడ్కర్ భవనాన్ని మున్సిపాలిటీ అధికారులు.. మంగళవారం తెల్లవారుజామున కూల్చివేశారు. ఆ స్థానంలో మార్కెట్‌ను నిర్మించేందుకు జేసీబీల సాయంతో భవనాన్ని పూర్తిగా తొలగించారు.
డోర్నకల్‌లో అంబేడ్కర్ భవనం కూల్చివేతను నిరసిస్తూ ఆందోళన - dornakal ambedkar bhavan
మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలకేంద్రంలో అంబేడ్కర్ భవనాన్ని కూల్చివేయడాన్ని నిరసిస్తూ ఎస్సీ, ఎస్టీ సంఘాలు ఆందోళనకు దిగాయి. వారిని పోలీసులు అడ్డుకోవడం వల్ల ఉద్రిక్తత నెలకొంది.
డోర్నకల్‌లో అంబేడ్కర్ భవనం కూల్చివేత
విషయం తెలుసుకున్న ఎస్సీ, ఎస్టీ సంఘాలు కూల్చివేసిన ప్రదేశానికి చేరుకుని ఆందోళనకు దిగారు. అంబేడ్కర్ భవనాన్ని ఎలా కూల్చివేస్తారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. సంఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు వారిని అడ్డుకోగా స్వల్ప ఉద్రిక్తత నెలకొంది.
ఎస్సీ, ఎస్టీ సంఘాల నాయకులను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అంబేడ్కర్ భవనం వద్ద డీఎస్పీ నరేశ్ కుమార్ ఆధ్వర్యంలో 100 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు.