తెలంగాణ

telangana

ETV Bharat / state

10 లక్షల దేనికి ఖర్చు చేశారో చెప్పండి : మంత్రి ఎర్రబెల్లి - mahabubabad news

గతంలో చాలా ముఖ్యమంత్రులను, రాజకీయ పార్టీలను చూశామని... గతానికీ ఇప్పటికీ పోల్చి విశ్లేషణ చేసుకోవాలని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్​రావు అన్నారు. మహబూబాబాద్ జిల్లా కేసముద్రంలో జరిగిన రెండో విడత పల్లె ప్రగతి కార్యక్రమంలో మంత్రి సత్యవతి రాఠోడ్​తో కలిసి పాల్గొన్నారు.

Say what is it cost expenses of  10 lakhs: Minister Errebelli
10 లక్షల దేనికి ఖర్చు చేశారో చెప్పండి : మంత్రి ఎర్రబెల్లి

By

Published : Jan 8, 2020, 12:06 PM IST

మహబూబాబాద్ జిల్లా కేసముద్రంలో జరిగిన రెండో విడత పల్లె ప్రగతి కార్యక్రమంలో మంత్రి సత్యవతి రాఠోడ్​తో కలిసి పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్​రావు పాల్గొన్నారు. గ్రామంలో పారిశుద్ధ్యం సరిగాలేదని, మొదటి విడత 30 రోజులు, రెండవ విడతలో ఏం చేస్తున్నారని మంత్రి ఎర్రబెల్లి ప్రశ్నించారు. గ్రామ కార్యదర్శి, గ్రామ ప్రత్యేక అధికారి, జిల్లా పంచాయతీ అధికారులపై అంతా దొంగలే అంటూ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. మంజూరు చేసిన 10 లక్షల రూపాయలు దేనికి ఖర్చు చేశారో చెప్పమన్నారు. ఆ అధికారులపై వెంటనే చర్య తీసుకోవాలని సూచించారు.

వారం రోజుల తర్వాత ఎవ్వరికీ చెప్పకుండా గ్రామాన్ని సందర్శిస్తానని, మార్పు రాకుంటే అధికారులు ఇంటికేనని హెచ్చరించారు. గ్రామంలోని పెన్షన్ దారులతో వార్డుల వారీగా కమిటీలను వేసి గ్రామ పారిశుద్ధ్య బాధ్యతలను వారికి అప్పగించాలన్నారు. గ్రామపంచాయతీ ముందు ఒక కంప్లైంట్ బాక్స్ పెట్టి అవినీతి అధికారులపై ఫిర్యాదు చేయాలన్నారు. గ్రామ పాఠశాలల్లో చదివిన ప్రతి ఒక్కరూ పాఠశాల, గ్రామ అభివృద్ధికి కృషి చేయాలని కోరారు. అనంతరం 11 మంది దళితులకు భూ పంపిణీ పత్రాలను, గ్రామ పంచాయతీకి ట్రాక్టర్​ను అందించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ మాలోత్ కవిత, జిల్లా పరిషత్ ఛైర్ ​పర్సన్ బిందు, జిల్లా అధికారులు, ప్రజా ప్రతినిధులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

10 లక్షల దేనికి ఖర్చు చేశారో చెప్పండి : మంత్రి ఎర్రబెల్లి

ఇదీ చూడండి : ఫేస్​బుక్​ను కొత్తగా వాడారు... బుక్కయ్యారు..!

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details