శ్మశాన వాటిక నిర్మాణంలో అలసత్వం ప్రదర్శించిన ఓ గ్రామ సర్పంచ్ సస్పెన్షన్‌కు గురయ్యారు. మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలంలో ఇది జరిగింది.
సర్పంచ్‌పై సస్పెన్షన్ వేటు.. నిర్లక్ష్య వైఖరే కారణం - శ్మశాన వాటిక
గ్రామపంచాయతీ అభివృద్ధిలో.. నిర్లక్ష్యం వహించినందుకుగాను మహబూబాబాద్ జిల్లాలో ఓ సర్పంచ్ సస్పెన్షన్‌కు గురయ్యారు. కేసముద్రం మండలం లాలూ తండా సర్పంచ్‌ను తాత్కాలికంగా సస్పెండ్ చేస్తూ.. కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు.
సర్పంచ్ సస్పెండ్.. నిర్లక్ష్య వైఖరే కారణం
ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపడుతోన్న.. వైకుంఠదామం నిర్మాణ పనులను ప్రారంభించకపోవడంతో అధికారులు పలుమార్లు.. లాలూ తండా సర్పంచ్ రామన్న నాయక్‌కు నోటీసులు జారీ చేశారు. డి.ఎం.ఎఫ్.టి నిధుల నుంచి రూ. 2 లక్షల నిధులను డ్రా చేసి కూడా నిర్మాణాన్ని మొదలు పెట్టలేదు. ఫలితంగా కలెక్టర్ చర్యలు తీసుకున్నారు. సంర్పచ్ను తొలగిస్తూ ఆదేశాలు జారీ చేశారు.