తెలంగాణ

telangana

ETV Bharat / state

ఆర్టీసీ బస్సు,లారీ ఢీ.. ఏడుగురికి గాయాలు - road accident at maripeda

ఆర్టీసీ బస్సు ,పత్తి లోడ్​తో వెళ్తోన్న లారీ ఢీ కొన్న ఘటన... మహబూబాబాద్ జిల్లా మరిపెడ శివారులో చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఒకరు తీవ్రంగా గాయపడగా.. మరో ఆరుగురికి స్వల్ప గాయాలయ్యాయి. క్షతగాత్రులకు స్థానిక పీహెచ్​సీలో చికిత్స అందిస్తున్నారు.

ఆర్టీసీ బస్సు పత్తి లారీ ఢీ.. ఏడుగురికి గాయాలు
ఆర్టీసీ బస్సు పత్తి లారీ ఢీ.. ఏడుగురికి గాయాలు

By

Published : Jan 1, 2020, 12:52 AM IST

మహబూబాబాద్ జిల్లా మరిపెడ శివారులోని గిరిజన సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల వద్ద ప్రమాదం చోటుచేసుకుంది. వరంగల్-ఖమ్మం జాతీయ రహదారిపై ఆర్టీసీ హన్మకొండ డిపోకు చెందిన బస్సు... ఆసిఫాబాద్ నుంచి గుంటూరుకు వెళ్తున్న పత్తి లారీ ఢీ కొన్నాయి. ఆంధ్రప్రదేశ్​లోని వినుకొండకు చెందిన లారీ డ్రైవర్ డొడ్డ శివశంకర్ రెడ్డికి తీవ్ర గాయాలయ్యాయి. బస్సులో ప్రయాణిస్తున్న ఆరుగురికి స్వల్ప గాయాలయ్యాయి. క్షతగాత్రులను ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు.

ఆర్టీసీ బస్సు పత్తి లారీ ఢీ.. ఏడుగురికి గాయాలు

ABOUT THE AUTHOR

...view details