మహబూబాబాద్ జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా పరిధిలోని రౌడీ షీటర్లకు.. రౌడీషీట్ మేళా కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లా ఎస్పీ కోటిరెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కార్యక్రమానికి జిల్లాలోని 270 మంది రౌడీ షీటర్లకు గానూ 200 మంది హాజరయ్యారు.
రౌడీషీట్ ఓపెన్ అయిన వ్యక్తుల ప్రవర్తన, శాంతియుత జీవన శైలిని పరిగణలోకి తీసుకుని వారిపై రౌడీషీట్ ఎత్తివేయడం జరుగుతుందని ఎస్పీ పేర్కొన్నారు. ఆయా పోలీస్స్టేషన్ల పరిధి ఎస్సైలను వారి పరిధిలోని రౌడీ షీటర్స్ పైన ఉన్న కేసుల వివరాలు, వారి ప్రవర్తన గురించి అడిగి తెలుసుకున్నారు. ప్రతి ఒక్కరూ వారి ప్రవర్తనను మార్చుకోవాలని సూచించారు.