లాక్డౌన్ కారణంగా ఉదయం 10 గంటల నుంచే మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని రహదారులు, ఆర్టీసీ బస్టాండ్లు నిర్మానుష్యంగా మారాయి. మహబూబాబాద్ నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్లే రహదారులపై పోలీసులు 11 చెక్ పోస్టులను ఏర్పాటు చేసి, సరైన పత్రాలు ఉంటేనే వాహనాలను అనుమతిస్తున్నారు. జిల్లా ఎస్పీ నంద్యాల కోటిరెడ్డి లాక్డౌన్ అమలు తీరును పరిశీలించారు. లాక్డౌన్ నుంచి మినహాయింపునిచ్చిన వారు మాత్రమే బయటకు రావాలని సూచించారు. అనవసరంగా బయట తిరిగితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ-పాస్లు, లాక్డౌన్లో సమస్యలపై పోలీస్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామని, సమస్యలు ఉన్నవారు సంప్రదించాలని తెలిపారు.
లాక్డౌన్తో రహదారులు నిర్మానుష్యం
మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో లాక్డౌన్ కఠినంగా అమలవుతోంది. చెక్పోస్టులు ఏర్పాటు చేసి పోలీసులు వాహనాలను తనిఖీ చేస్తున్నారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు.
లాక్డౌన్ కారణంగా నిర్మానుష్యంగా మారిన రోడ్లు
ఉదయం 6 నుంచి 10 గంటల వరకు మినహాయింపు ఉన్నా ప్రయాణికులు లేక మహబూబాబాద్ ఆర్టీసీ డిపోలో కేవలం 4 బస్సు సర్వీసులను మాత్రమే నడిపించారు. ఉదయం కూరగాయల మార్కెట్ సహా పలు దుకాణాల్లో రద్దీ నెలకొంది.