మహబూబాబాద్ జిల్లాలోని జమాండ్లపల్లి నుంచి కంబాలపల్లి వరకు ఉన్న 365 జాతీయ రహదారి పొడవునా రైతులు మూకుమ్మడిగా మొక్కజొన్నలను ఆరబోశారు. రోడ్డుపైన ఆరేసిన మొక్కజొన్నలను దూరం నుంచి చూస్తే మొత్తం పచ్చరంగేసినట్లుగా కనిపించడం విశేషం. ఈ దృశ్యాన్ని చూసేందుకు ఆకర్షణీయంగా కనిపిస్తున్నా.. వాహనదారులు మాత్రం ప్రయాణం కష్టమవుతోందని వాపోతున్నారు. రాత్రివేళల్లో తీవ్ర ఇబ్బందిగా ఉంటోందని వాహనదారులు భయాందోళన వ్యక్తం చేశారు.
రోడ్డె కల్లం..వాహనదారులకు కళ్లెం... - రహదారి పొడవునా రైతులు మూకుమ్మడిగా మొక్కజొన్నలను ఆరబోశారు
మొక్కజొన్న పంట చేతికొచ్చింది. గింజల్లో తేమ పోవాలంటే...ఆరబెట్టాల్సిందే. అందుకోసం రహదారికి మించింది మరేం ఉంటుంది. రైతులకు సౌకర్యంగానే ఉన్నా..తమకు మాత్రం ఇబ్బందికరంగా ఉందన్నారు వాహనదారులు.
![రోడ్డె కల్లం..వాహనదారులకు కళ్లెం...](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4776487-thumbnail-3x2-roddu.jpg)
వాహనదారులను ఇబ్బంది పెడుతోన్న మెుక్కజొన్నల ఆరబోత
వాహనదారులను ఇబ్బంది పెడుతోన్న మెుక్కజొన్నల ఆరబోత
TAGGED:
RODDU PAINA MOKKA JONNALU