తెలంగాణ

telangana

ETV Bharat / state

రోడ్డుప్రమాదంలో ఓ వ్యక్తి మృతి - Road accident at mahabubabad district

వరంగల్- ఖమ్మం ప్రధాన రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి దుర్మరణం పాలయ్యాడు.

ఓ వ్యక్తి మృతి

By

Published : Jun 18, 2019, 7:22 PM IST

Updated : Jun 18, 2019, 10:58 PM IST

మహబూబాబాద్ జిల్లా కొత్తతండా వద్ద లారీ- ద్విచక్రవాహనం ఢీకొన్న ఘటనలో ఓ వ్యక్తి మృతి చెందాడు. ఖమ్మం జిల్లా బోనకల్‌ మండలం గోపాలపురం గ్రామానికి చెందిన టి.ఆనంద్‌రావు అనే వ్యక్తి మహబూబాబాద్‌ జిల్లా తొర్రూరులోని బీసీ వసతిగృహంలో ఒప్పంద ఉద్యోగిగా పని చేస్తున్నాడు. ద్విచక్ర వాహనంపై తొర్రూరుకు వెళ్తుండగా... వరంగల్‌ నుంచి ఖమ్మం వైపు వెళ్తున్న ఓ లారీ ఆనందరావు ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది. తలకు బలమైన గాయాలు కావడం వల్ల ఆయన అక్కడికక్కడే మరణించాడు. పోలీసులు ప్రమాదస్థలాన్ని పరిశీలించి.. కేసు దర్యాప్తు చేపట్టారు.

రోడ్డుప్రమాదంలో ఓ వ్యక్తి మృతి
Last Updated : Jun 18, 2019, 10:58 PM IST

ABOUT THE AUTHOR

...view details