మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా వీఆర్వోల నుంచి దస్త్రాల స్వాధీనం - మహబూబాబాద్‌లో తహసీల్దార్లకు రెవెన్యూ రికార్డుల అప్పగింత
మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా వీఆర్వోల దగ్గర నుంచి ఆయా మండలాల తహసీల్దార్లు రెవెన్యూ రికార్డులను స్వాధీనం చేసుకన్నారు. రికార్డులు పరిశీలించి, కార్యాలయంలో భద్రపరిచారు.

మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా వీఆర్వోల నుంచి దస్త్రాల స్వాధీనం
రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలతో మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా వీఆర్వోలు తమ వద్ద ఉన్న రెవెన్యూ రికార్డులు, ట్యాబ్‌లు, పహాణీలు, 1-బీలు, విరాసత్‌కు సంబంధించిన దస్త్రాలు తహసీల్దార్ కార్యాలయాల్లో అప్పగించారు. స్వాధీనం చేసుకున్న రికార్డులను పరిశీలించి, రిజిస్టర్ల నమోదు చేసి, కార్యాలయంలో భద్రపరిచారు.