మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి తహసీల్దార్ కార్యాలయం ముందు రెవెన్యూ అధికారులు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు. గూడూరు తహసీల్దార్‌పై జరిగిన దాడిని ఖండించారు. రెవెన్యూ అధికారులపై జరుగుతున్న దాడులను అరికట్టాలని తహసీల్దార్‌తోపాటు వీఆర్వోలు, వీఆర్ఏలు నిరసన వ్యక్తం చేశారు. ఇలాంటి దాడులు తిరిగి పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
రెవెన్యూ అధికారుల నిరసన - empliese
గూడూరు తహసీల్దార్‌పై జరిగిన దాడిని నిరసిస్తూ మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లిలో రెవెన్యూ ఉద్యోగులు నిరసన తెలిపారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని కోరారు.
నిరసన తెలుపుతున్న ఉద్యోగులు