రైతులందరినీ సంఘటిత పరిచి ఆర్థికంగా బలోపేతం చేసేందుకు జిల్లాలో 80 రైతు వేదికలు నిర్మించనున్నామని మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ పీవీ గౌతమ్ తెలిపారు. మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం తండ ధర్మారం లో వానాకాలం 2020 సాగు నియంత్రణపై నిర్వహించిన అవగాహన సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
మార్కెట్లో డిమాండ్ ఉన్న పంటలనే వేస్తూ రైతులు ఆర్థిక ప్రగతి సాధించడమే ప్రభుత్వ ఆశయమని కలెక్టర్ వివరించారు. సన్న రకం వరితో పాటు మంచి డిమాండ్ ఉన్న పత్తి కంది సాగు చేసేందుకు రైతులు దృష్టి సారించాలని ఆయన సూచించారు.