మహబూబాబాద్ జిల్లా కేసముద్రం వ్యవసాయ మార్కెట్లో మిర్చి క్వింటా గరిష్ఠ ధర రూ.16 వేల పలికింది. ఈ సీజన్లో ఇదే గరిష్ఠ ధర కావడం విశేషం.
రికార్డు స్థాయిలో రూ.16 వేలు పలికిన క్వింటా మిర్చి - highest mirchi price in kesamudram agricultural market
రోజురోజుకు పెరుగుతున్న మిర్చి ధరలతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కేసముద్రంలో క్వింటా మిర్చి ధర రూ.16వేల పలికి రికార్డు సృష్టించింది.
ఈ మార్కెట్‌కు గురువారం సుమారు 1200 బస్తాల మిర్చి విక్రయానికి వచ్చింది. మిర్చి సీజన్ ప్రారంభం నుంచి క్వింటా ధర రూ.12000 నుంచి గరిష్ఠంగా రూ.15,600 పలికింది. గురువారం మాత్రం నెల్లికుదుర్ మండలం ఎర్రబెల్లి గూడెం గ్రామానికి చెందిన రైతు బి.రాము మిర్చిని.. శ్రీ రంగనాథ ట్రేడర్స్ వ్యాపారి సట్ల శ్రీనివాస్.. క్వింటా రూ. 16,000 లెక్క కొనుగోలు చేసి రికార్డు సృష్టించాడు. రోజురోజుకు మిర్చి ధర పెరుగుతుండడం వల్ల రైతుల్లో ఆనందం వ్యక్తమవుతోంది.
ఇవీచూడండి:'ఆక్రమణకు గురైన వక్ఫ్‌బోర్డు ఆస్తులు ఎన్ని స్వాధీనం చేసుకున్నారు..?'