ములుగు జిల్లా నుంచి కృష్ణా జిల్లాకు అక్రమంగా రవాణా చేస్తున్న రేషన్ బియ్యం లారీని మహబూబాబాద్ పోలీసులు పట్టుకున్నారు. లారీలో ఉన్న 265 క్వింటాళ్ల బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నట్టు ఎస్పీ కోటిరెడ్డి వెల్లడించారు. డ్రైవర్ని అరెస్ట్ చేసి అక్రమ రవాణాకు పాల్పడుతున్న ఆరుగురు వ్యక్తులపై కేసు నమోదు చేశామన్నారు. రేషన్ బియ్యం అక్రమ వ్యాపారం చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ హెచ్చరించారు. అక్రమంగా రవాణా అవుతున్న బియ్యం లారీని పట్టుకున్న సీఐ. రవికుమార్, ఎస్ఐ. అరుణ్ కుమార్, సివిల్ సప్లై అధికారి నారాయణ రెడ్డిలను ఎస్పీ అభినందించారు.
265 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత - అక్రమంగా తరలిస్తున్న
అక్రమంగా తరలిస్తున్న 265 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని పోలీసులు పట్టుకున్నారు.
అక్రమంగా తరలిస్తున్న 265 క్వింటాళ్ల బియ్యం పట్టివేత