కరోనా టెస్టులు చేయాలంటూ మహబూబాబాద్ జిల్లా గుడూరు మండల కేంద్రంలోని సామాజిక ఆరోగ్య కేంద్రం ముందు బాధితులు ఆందోళన చేపట్టారు. వరంగల్-మహబూబాబాద్ ప్రధాన రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. దీనితో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. గత నాలుగు రోజులుగా హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్నా పరీక్షలు చేయడం లేదని బాధితులు ఆరోపించారు.
కరోనా పరీక్షలు చేయడంలేదని బాధితుల ధర్నా
మహబూబాబాద్ జిల్లా గుడూరు సామాజిక ఆరోగ్య కేంద్రం ఎదుట ప్రైమరీ కాంటాక్ట్ బాధితులు ఆందోళన చేపట్టారు. తమకు పరీక్షలు చేయకుండా రోజుల తరబడి వైద్యసిబ్బంది దవాఖానా చుట్టూ తిప్పుతున్నారని ఆరోపించారు.
కరోనా పరీక్షలు చేయాలంటూ ప్రైమరీకాంటాక్ట్ బాధితుల ధర్నా
దవాఖానా సిబ్బంది మాత్రం ప్రతి రోజు మొదట వచ్చిన 50 మందికి పరీక్షలు నిర్వహిస్తున్నామని చెబుతున్నారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని లక్షణాలు ఉన్న ప్రతిఒక్కరికీ పరీక్షలు చేయిస్తామని హామీ ఇవ్వడం వల్ల రాస్తారోకోను విరమించారు.
ఇదీ చూడండి :ఆ యాప్ సాయంతో.. సులభంగా సరకు రవాణా