రాష్ట్రీయ ఏక్తా దివస్‌ని పురస్కరించుకుని మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని టౌన్ పోలీస్ స్టేషన్ నుంచి నెహ్రూ సెంటర్ వరకు పోలీస్ సిబ్బంది కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. సర్దార్ వల్లభ్ భాయి పటేల్ సేవలను గుర్తుచేసుకున్నారు. ఆయన దూరదృష్టి చర్యల ద్వారానే దేశ ఐక్యత సాధ్యమైందని... ఈ ఐక్యత స్ఫూర్తితో దేశ భద్రతను కాపాడటానికి నా వంతు బాధ్యత నిర్వహిస్తానంటూ వారు ప్రతిజ్ఞ చేశారు.
రాష్ట్రీయ ఏక్తాదివస్ని సందర్భంగా పోలీసుల కొవ్వొత్తులు ర్యాలీ - రాష్ట్రీయ ఏక్తాదివస్ వేడుకలు తాజా వార్త
రాష్ట్రీయ ఏక్తాదివస్ వేడుకలను మహబూబాబాద్ పట్టణ పోలీసులు ఘనంగా నిర్వహించారు. సర్దార్ వల్లభ్ భాయి పటేల్ సేవలను గుర్తుచేసుకుంటూ నగరంలో కొవొత్తుల ర్యాలీ చేపట్టారు.

రాష్ట్రీయ ఏక్తాదివస్ని సందర్భంగా పోలీసుల కొవ్వొత్తులు ర్యాలీ
స్వాతంత్య్రానంతరం సంస్థానాలు భారతదేశంలో విలీనం కావడానికి కృషిచేసిన ఉక్కు మనిషి సర్దార్ వల్లభ్ భాయి పటేల్ అని.. ఆయన సేవలు ఎనలేనివని డీఎస్పీ నరేశ్‌కుమార్ అన్నారు.
ఇదీ చూడండి:తెలంగాణ ఇంటలిజెన్స్ చీఫ్‌గా ప్రభాకర్‌రావు నియామకం