మద్యం మత్తులో ఓ మానసిక వికలాంగురాలిపై అత్యాచారం చేశాడో కామాంధుడు. మహబూబాద్ జిల్లా బయ్యారం మండలం వెంకట్రాంపురంలో ఈ అమానవీయ ఘటన చోటు చేసుకుంది. తన తల్లితో కలిసి నిద్రిస్తున్న యువతిని జగ్నా తండాకు చెందిన ఓ వివాహితుడు ఎత్తుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. కూతురు లేదని గ్రహించిన తల్లి వెతికింది. ఆరుబయట వివస్త్రగా అచేతన స్థితిలో పడి ఉండటాన్ని గమనించింది. ఏమి జరిగిందో చెప్పలేని స్థితిలో ఉన్న కూతురును చూసి అసలు విషయాన్ని గుర్తించింది తల్లి. నిందితుడిని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. బాధితురాలు, తల్లి ఫిర్యాదుతో బయ్యారం పోలీసులు నిందితుడిపై అత్యాచారం కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.
మద్యం మత్తులో మానసిక వికలాంగురాలిపై అత్యాచారం - Rape on the mentally disabled in alcohol intoxication
రాష్ట్రంలో కామాంధులు చెలరేగిపోతున్నారు. కన్ను మిన్ను కానక మానవత్వాన్ని మంటగల్పుతున్నారు. వావి వరుసలు, వయసుతో సంబంధం లేకుండా మృగాళ్లలా మీదడిపోతున్నారు. మానసిక వికలాంగురాలు అని కూడా చూడకుండా ఓ కామోన్మాది దుశ్చర్యకు పాల్పడ్డాడు.
![మద్యం మత్తులో మానసిక వికలాంగురాలిపై అత్యాచారం](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-3773443-thumbnail-3x2-ppp.jpg)
Rape on the mentally disabled in alcohol intoxication