ఎనిమిదేళ్ల చిన్నారిపై అత్యాచారయత్నం ఘటన మహబూబాబాద్ జిల్లా కురవి మండల పరిధిలో ఆలస్యంగా వెలుగు చూసింది. మండల పరిధిలోని ఓ గ్రామానికి చెందిన ఎనిమిదేళ్ల చిన్నారి... గతేడాది డిసెంబరు 29న రాత్రి జి. నాగేశ్వర్‌రావు అనే వ్యక్తి కిరాణ దుకాణానికి బిస్కెట్ల కోసం వచ్చింది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆ చిన్నారిపై నిందితుడు అత్యాచారం చేసేందుకు ప్రయత్నించాడు. అక్కడి నుంచి చిన్నారి తప్పించుకుంది. ఈ విషయాన్ని తల్లిదండ్రులకు ఆలస్యంగా చెప్పగా.. వారు సోమవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. పొక్సో చట్టం కింద నిందితుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఎస్సై శంకర్ రావు తెలిపారు.
ఎనిమిదేళ్ల చిన్నారిపై అత్యాచారయత్నం - rape attempt on girl in kuravi mandal
మహబూబాబాద్ జిల్లా కురవి మండల పరిధిలోని ఓ గ్రామంలో... ఎనిమిదేళ్ల చిన్నారిపై ఓ వ్యక్తి అత్యాచారయత్నం చేసిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. నిందితుడిపై పొక్సో చట్టం కింద కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.
ఎనిమిదేళ్ల చిన్నారిపై అత్యాచారయత్నం