తెలంగాణ

telangana

ETV Bharat / state

మైనర్​ బాలికపై అత్యాచార యత్నం - మహబూబాబాద్​ తాజా వార్త

గొర్రెలను మేపేందుకు వెళ్లిన ఓ మైనర్ గిరిజన బాలికపై ఇద్దరు యువకులు అత్యాచార యత్నం చేసిన ఘటన సూర్యాపేట జిల్లాలో చోటుచేసుకుంది.

rape attempt on a shepherd  minor girl in mahabubabad
మైనర్​ బాలికపై అత్యాచార యత్నం

By

Published : Feb 22, 2020, 11:51 AM IST

సూర్యాపేట జిల్లా ఆత్మకూర్(ఎస్) మండలం పాతర్ల పహాడ్​లో మైనర్ గిరిజన బాలికపై అత్యాచార యత్నం జరిగింది. గ్రామ శివారు కాకి తండాకు చెందిన ఇంటర్ ప్రథమ సంవత్సరం చదువుతున్న ఆ బాలిక, శివరాత్రి సెలవు కావడం వల్ల గొర్రెలను మేపేందుకు పంట చేలకు వెళ్లింది.

పాతర్ల పహాడ్ గ్రామానికి చెందిన కొమ్ము నవీన్, గుంటూరు గోవర్ధన్​ ఒంటరిగా ఉన్న ఆ బాలికపై అత్యాచారయత్నం చేశారు. బాధిత బాలిక కేకలు వేయడం వల్ల సమీపంలో ఉన్న ఓ వ్యక్తి అక్కడకు చేరుకున్నాడు. దానిని గమనించిన దుండగులు అక్కడి నుంచి పరారయ్యారు.

బాలిక కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు ఆత్మకూరు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. చికిత్స నిమిత్తం బాలికను సూర్యాపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. నిందితులను అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నట్లు తెలిపారు.

మైనర్​ బాలికపై అత్యాచార యత్నం

ఇదీ చూడండి :మాటలతో మాయ చేసి.. మంత్రి పేరుతో ముంచేస్తాడు..!

ABOUT THE AUTHOR

...view details