ఈదురుగాలులతో కూడిన అకాల వర్షం కురవడం వల్ల మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలంలోని ఇనుగుర్తి , అయ్యగారిపల్లి గ్రామాలలోని ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో పంట తడిసిపోయింది. పలు గృహాల పైకప్పులు ఎగిరిపోయాయి. రైతులు తమ ధాన్యంపై టార్పాలిన్లు కప్పినా ఫలితం లేకుండా పోయింది. ఈదురు గాలులకు టార్పాలిన్లు ఎగిరిపోవడం వల్ల ధాన్యం పూర్తిగా తడిచిపోయింది. వర్షం ఆగిపోయిన వెంటనే రైతులు పంట పక్కన నిలిచిపోయిన నీటిని కాలువలు తీసి బయటికి పంపించారు.
ఈదురుగాలులతో కూడిన వర్షం.. అన్నదాతకు అపార నష్టం - Rain_Damage
మహబూబాబాద్ జిల్లా కేసమద్రం మండలంలోని ఇనుగుర్తి, అయ్యగారిపల్లి గ్రామాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. ఈ వర్షం వల్ల ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో పంట తడిసిపోయింది. పలు ప్రాంతాల్లో ఇంటి పైకప్పులు ఎగిరిపోయాయి.
అనంతరం రైతులంతా ఇనుగుర్తి-కేసముద్రం ప్రధాన రహదారిపైకి చేరుకొని తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలంటూ రాస్తారోకో చేపట్టారు. పలు గృహాల పైకప్పులు లేచిపోవడం, ధ్వంసం కావడం వల్ల పలువురికి తీవ్రనష్టం వాటిల్లింది. ఇంటి పైకప్పు ఎగిరిపోయిన ఓ ఇంట్లో వృద్ధురాలు రోదించడం అందర్నీ కలిచివేసింది. తడిసి పోయిన ధాన్యాన్ని మద్దతు ధరతో వెంటనే కొనుగోలు చేయాలని, నష్టం వాటిల్లిన గృహాలకు పరిహారం చెల్లించాలని బాధితులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
ఇవీ చూడండి: 'సీఎం కేసీఆర్ ఇప్పటికైనా తగిన చర్యలు తీసుకోవాలి'