మహబూబాబాద్ జిల్లా బొల్లేపల్లి గ్రామంలో ఆదివారం సాయంత్రం ఈదురు గాలులతో కూడిన అకాల వర్షం కురిసింది. పిడుగు పడి సుజాత అనే 40 సంవత్సరాల మహిళ అక్కడికక్కడే మృతి చెందింది. నెల్లికుదురు మండలం చిన్న ముప్పారం గ్రామంలో విద్యుదాఘాతానికి గురై రెండు ఎద్దులు మృతి చెందాయి. చాలా చోట్ల చెట్లు విరిగి రహదారులపై పడ్డాయి. ఇళ్ల పైకప్పులు లేచిపోయాయి. అకాల వర్షంతో పిడుగుపాటుకు గురై నష్టపోయిన కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని బాధితులు విజ్ఞప్తి చేస్తున్నారు.
మహబూబాబాద్‌లో అకాల వర్షం... అపార నష్టం - rain-effect in Mahabubabad district
ఆదివారం సాయంత్రం కురిసిన అకాల వర్షానికి మహబూబాబాద్ జిల్లా వాసులు అతలాకుతలం అయ్యారు. బొల్లేపల్లి గ్రామంలో పిడుగుపడి ఓ మహిళ మృతి చెందింది. విద్యుదాఘాతానికి గురై రెండు ఎద్దులు చనిపోయాయి.
మహబూబాబాద్‌లో అకాల వర్షం... అపార నష్టం