ఒకవైపు రుతుపవనాలు... మరోవైపు అల్పపీడనం ప్రభావంతో మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా ఎడతెరిపిలేకుండా వర్షం కురుస్తోంది. సాయంత్రం ఈదురుగాలులతో భారీ వర్షం కురిసింది. మహబూబాబాద్, గార్ల, బయ్యారం, నెల్లికుదురు, కేసముద్రం, గంగారం, కొత్తగూడ మండలాల్లో భారీ వర్షం కురవగా... గుడూరు, కురవి, మరిపెడ మండలాలలో ఓ మోస్తరు వర్షం కురిసింది.
మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా ఎడతెరిపిలేని వర్షం - మహబూబాబాద్ జిల్లాలో వానలు
ఒకవైపు రుతుపవనాలు... మరోవైపు అల్పపీడనం ప్రభావంతో మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా ఎడతెరిపిలేకుండా వర్షం కురుస్తోంది.
మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా ఎడతెరిపిలేని వర్షం
మున్నేరు, ఆకేరు, పాలేరు, వట్టివాగులు పొంగిపొర్లుతున్నాయి. చెరువులు నిండుకుండను తలపిస్తున్నాయి. బయ్యారం చెరువు ఉద్ధృతంగా అలుగు పోస్తోంది. గుడూరు మండలం సీతానగరం శివారులోని భీమునిపాదం జలపాతం వద్దపై నుంచి నీరు కిందకు పడటం చూపరులను ఆకర్షిస్తోంది.