ప్రైవేట్ ఉపాధ్యాయులకు వేతనాలు చెల్లించాలంటూ రాష్ట్ర ప్రైవేట్ టీచర్స్ ఫోరం ఆధ్వర్యంలో మహబూబాబాద్‌లో విద్యాశాఖ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. అనంతరం తమ సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని జిల్లా విద్యాశాఖ అధికారి సోమశేఖర శర్మకు అందజేశారు. ప్రైవేట్ టీచర్లకు గత ఆరు నెలలుగా వేతనాలు లేక జిల్లాలోని 6 వేల మంది తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని జిల్లా కన్వీనర్ రామచంద్రయ్య తెలిపారు.
'ప్రైవేటు ఉపాధ్యాయులకు వేతనాలు చెల్లించాలి' - mahaboobabad news
మహబూబాబాద్‌లోని విద్యాశాఖ కార్యాలయం ఎదుట రాష్ట్ర ప్రైవేట్ టీచర్స్ ఫోరం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. తమ సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని విద్యాశాఖ అధికారి సోమశేఖర శర్మకు అందించారు.
private teachers protest for salaries in mahaboobabad
కూలీనాలి పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటూన్నామని ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం వెంటనే స్పందించి వేతనాలు చెల్లించే విధంగా చూడాలని కోరారు. గుర్తింపు కార్డులను అందించి... ఈఎస్ఐ, పీఎఫ్, ప్రమాద బీమా సౌకర్యాలు కల్పించాలని కోరారు. ప్రభుత్వ, ప్రైవేటు రంగాలు కలిసి పని చేస్తేనే వ్యవస్థ నడుస్తుందని... ఉపాధ్యాయుల సమస్యలను పాఠశాలల యాజమాన్యాల దృష్టికి తీసుకొని పోతానని జిల్లా విద్యాశాఖ అధికారి సోమశేఖర శర్మ హామీ ఇచ్చారు.