కరోనా వైరస్ పట్టణాల్లోనే కాకుండా పల్లెల్లోనూ వేగంగా విస్తరిస్తోంది. కాగా మహబూబాబాద్ జిల్లా నడివాడ గ్రామంలో సుమారు 20 మంది వైరస్ బారిన పడ్డారు. దీనితో గ్రామస్థులంతా మహమ్మారి బారినపడిన వాళ్లు తొందరగా కోలుకోవాలని.. మరెవరికి కొవిడ్ సోకకూడదని గ్రామదేవతైన ముత్యాలమ్మ తల్లికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
కరోనా నుంచి కాపాడాలని గ్రామ దేవతలకు ప్రత్యేక పూజలు - కరోనా నుంచి కాపాడాలంటూ నడివాడ గ్రామప్రజల పూజలు
కరోనా బారి నుంచి కాపాడాలని కోరుతూ మహబూబాబాద్ జిల్లా నడివాడ గ్రామ ప్రజలు గ్రామదేవతలకు ప్రార్థనలు చేశారు. కొవిడ్‌తో బాధపడుతున్న గ్రామస్థులు త్వరగా కోలుకోవాలంటూ అమ్మవార్లను వేడుకున్నారు.
Breaking News
భక్తిశ్రద్ధలతో అమ్మవార్లకు అభిషేకాలు చేశారు. తమ గ్రామాన్ని కరోనా బారినుంచి కాపాడమ్మా అంటూ గ్రామదేవతలను వేడుకున్నారు.
ఇదీ చూడండి :ఆ యాప్ సాయంతో.. సులభంగా సరకు రవాణా