ప్రపంచ ధరిత్రి దినోత్సవాన్ని పురస్కరించుకుని మహబూబాబాద్ జిల్లా జమాండ్లపల్లి శివారులో జిల్లా పాలనాధికారి శివలింగయ్య మొక్కలను నాటారు. 'అందరూ బాగుండాలి.. అందులో మనం ఉండాలి' అనే సామెత ప్రకృతి సిద్దాంతానికి వర్తిస్తుందని ఆయన తెలిపారు. భూమి పై మనుగడ సాగిస్తున్న ప్రతి జీవికి ప్రకృతిని కాపాడాల్సిన బాధ్యత ఉందన్నారు. ప్రపంచ ధరిత్రి దినోత్సవంపై విద్యార్థులకు నిర్వహించిన వ్యాసరచన పోటీలలో విజేతలకు బహుమతులను అందచేశారు.
"భూమిపై ప్రతి జీవి మనుగడను కాపాడాలి" - collector
మహబూబాబాద్ జిల్లా జమాండ్లపల్లిలో ప్రపంచ ధరిత్రి దినోత్సవ సందర్భంగా జిల్లా కలెక్టర్ మెుక్కలు నాటారు. విద్యార్థులకు నిర్వహించిన వ్యాస రచన పోటీల్లో విజేతలకు బహుమతుల ప్రదానం చేశారు.
భూమిపై ప్రతి జీవి మనుగడను కాపాడాలి