తెలంగాణ

telangana

ETV Bharat / state

కాడెద్దులుగా తండ్రీ కొడుకు.. అరకతో తల్లి... - మహబూబాబాద్‌ జిల్లా కాడెద్దులు లేకుండా అరక

ఆ నిరుపేద రైతు కుటుంబానికి కాడెద్దులు కొనే ఆర్థిక స్తోమత లేదు. రెక్కలు ముక్కలు చేసుకుని పంట సాగు చేస్తేనే కడుపు నిండేది. కొనుగోలు భారమై కుటుంబ సభ్యులే కాడెద్దులుగా మారారు. తండ్రీ కొడుకు కాడెద్దుల్లా అరకని లాగుతూ... వ్యవసాయ పనులను ఇలా సాగిస్తోంది మహబూబాబాద్‌ జిల్లా నర్సింహులపేట మండలం ఫకిరాతండాకు చెందిన ఆ రైతు కుటుంబం.

poor farmer cultivation without bullocks in mahabubabad district
తండ్రి, కొడుకు కాడెద్దులుగా... తల్లి అరకతో

By

Published : Oct 12, 2020, 11:16 AM IST

ఆర్థిక స్తోమత లేక తండ్రీ కొడుకులే కాడెద్దులుగా మారారు. తల్లి పద్మ నాగలిని పట్టుకుని దున్నుతుంటుంది. కుటుంబసభ్యులే కాడెద్దులుగా మారి ఇలా కాలం వెల్లదీస్తోంది ఆ కుటుంబం. మహబూబాబాద్‌ జిల్లా నర్సింహులపేట మండలం ఫకిరాతండాకు చెందిన నేతావత్‌ వెంకన్నకు ముంగిమడుగు శివారులో ఒక ఎకరం వ్యవసాయ భూమి ఉంది. మిరప సాగు చేసేందుకు ముందుగా ట్రాక్టర్‌తో దుక్కి దున్నించారు. తరువాత కుటుంబ సభ్యులే ఇలా నాగలి పట్టి సాగు చేసుకుంటున్నారు.

తండ్రి వెంకన్న, కుమారుడు సుధాకర్‌ ఇలా కాడెద్దులగా మారి నాగలి లాగుతుండగా భార్య పద్మ నాగలి పట్టుకుని అరక దున్నుతారు. దాతలు ఎవరైనా తమకు కాడెద్దులు సమకూర్చినట్లయితే సాగు కష్టాలు తొలగిపోతాయని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

"కాడెద్దులు కొనే ఆర్థికస్తోమత మాకు లేదు. కొంతకాలం నుంచి మేమే నాగలిపట్టి వ్యవసాయ పనులు చేస్తున్నాం. ఎవరైనా దాతలు ముందుకు వస్తారని ఆశిస్తున్నాం."

- నేతావత్ వెంకన్న, రైతు

తండ్రి, కొడుకు కాడెద్దులుగా... తల్లి అరకతో

ఇదీ చదవండి:వాగులో వంద గొర్రెలు గల్లంతు...

ABOUT THE AUTHOR

...view details