మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ నియోజకవర్గంలోని వాగులు నిండుకుండలా మారాయి. చిన్నగూడూరు మండలంలోని ఆకేరు, దంతాలపల్లి మండలంలోని పాలేరు, డోర్నకల్‌లోని మున్నేరు వాగులకు వరద నీరు పోటెత్తింది. ఎగువ నుంచి భారీగా వరద నీరు వస్తుండటం వల్ల వాగులు ఉద్ధృతంగా ప్రవహించి అలుగు పారుతున్నాయి.
ఉప్పొంగుతున్న వాగులు.. వరదనీటితో చెక్‌డ్యామ్‌ల పరవళ్లు - mahabubabad district rain updates
రెండురోజుల నుంచి కురుస్తున్న వర్షాలకు మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ నియోజకవర్గంలోని వాగులు పొంగిపొర్లుతున్నాయి. పెద్ద ఎత్తున వరద నీరు చేరి చెక్‌డ్యామ్‌లు పరవళ్లు తొక్కుతున్నాయి.

డోర్నకల్‌లో ఉప్పొంగుతున్న వాగులు
వాగులపై నిర్మించిన చెక్ డ్యాంలు నిండుకుండలా మారి పొంగి పొర్లుతున్నాయి. గతంలో ఎన్నడూ లేనివిధంగా ఈ ఏడాది సమృద్ధిగా వర్షాలు కురవడం వల్ల రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.