మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో పోలింగ్ సామగ్రి పంపిణీ కేంద్రాలను కలెక్టర్ శివలింగయ్య, ఎస్పీ కోటిరెడ్డి పరిశీలించారు. రేపు ఉదయం సెక్టోరల్ అధికారులు, రాజకీయ పార్టీల ఏజెంట్ల సమక్షంలో నమూనా పోలింగ్ చేయాలని తెలిపారు. ఈ ప్రక్రియ ఉదయం 6.30కు పూర్తి కావాలని కలెక్టర్ ఆదేశించారు. ఉద్యోగులు పోలింగ్ సామాగ్రితో నేటి సాయంత్రం వరకు పోలింగ్ కేంద్రాలకు చేరుకుంటారని తెలిపారు. 5 అంచెల భద్రతా ఏర్పాట్లు చేసినట్లు ఎస్పీ కోమటిరెడ్డి స్పష్టం చేశారు.
పోలింగ్ సామగ్రి పంపిణీ కేంద్రాలు పరిశీలించిన కలెక్టర్ - officers
రేపు జరిగే పార్లమెంట్ ఎన్నికలకు మహబూబాబాద్ జిల్లాలో అన్ని ఏర్పాట్లు పూర్తిచేశామని కలెక్టర్ శివలింగయ్య తెలిపారు. అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా భద్రతా ఏర్పాట్లు చేశామని ఎస్పీ కోటిరెడ్డి తెలిపారు.
పంపిణీ కేంద్రాలు పరిశీలించిన కలెక్టర్