తెలంగాణ

telangana

ETV Bharat / state

తొర్రూరులో నకిలీ పత్తివిత్తనాలు విక్రయిస్తున్న ముఠా గుట్టురట్టు - మహబూబాబాద్​ నేర వార్తలు

నకిలీ పత్తివిత్తనాలు విక్రయిస్తున్న ఎనిమిది మందిని మహబూబాద్​ జిల్లా తొర్రూరులో పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి 140కేజీల నకిలీ విత్తనాలు స్వాధీనం చేసుకున్నారు.

Police seize 140kgs of fake cotton seeds
తొర్రూరులో నకిలీ పత్తివిత్తనాలు విక్రయిస్తున్న ముఠా గుట్టురట్టు

By

Published : Jun 30, 2020, 4:50 AM IST

మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండల కేంద్రంలో నకిలీ పత్తి విత్తనాలు విక్రయిస్తున్న ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. ఎనిమిది మందిని అదుపులోకి తీసుకుని వారి నుంచి 140 కేజీల నకిలీ విత్తనాలు స్వాధీనం చేసుకున్నారు.

ఎవరైనా నకిలీ విత్తనాలు విక్రయిస్తే వారిపై పీడీ చట్టం కింద కేసు నమోదు చేస్తామని పోలీసుల హెచ్చరించారు. రైతులను ఎవరు మోసం చేసిన కఠినంగా శిక్షించాలని ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారని... అక్రమాలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ నంద్యాల కోటిరెడ్డి హెచ్చరించారు.

ఇవీ చూడండి:హోంమంత్రి మహమూద్​ అలీకి కరోనా పాజిటివ్

ABOUT THE AUTHOR

...view details