తెలంగాణ

telangana

ETV Bharat / state

నిజాయితీ చాటుకున్న పోలీసులు - Police handed over a bag of gold jewelery to the victim in Maghabubabad district

పది రూపాయలు రోడ్డుపై దొరికినా జేబులో వేసుకునే ఈ రోజుల్లో ఓ పోలీసు ఏకంగా ఏడు తులాల బంగారాన్ని బాధితులకు అప్పగించి తన నిజాయితీ చాటుకున్నాడు. మహబూబాబాద్ జిల్లా తొర్రూర్​ ఆర్టీసీ బస్సులో మరిచిపోయిన బంగారు ఆభరణాల బ్యాగును మరిపెడ పోలీసులు స్వాధీనం చేసుకొని సదరు వ్యక్తికి అప్పగించారు.

Police handed over a bag of gold jewelery to the victim in Maghabubabad district
నిజాయితీ చాటుకున్న పోలీసు

By

Published : Dec 30, 2019, 9:19 AM IST

Updated : Dec 30, 2019, 11:13 AM IST

వరంగల్‌కు చెందిన కొప్పుల అనిల్‌ అనే వ్యక్తి తొర్రూరులో జరిగిన ఓ శుభకార్యానికి ఆర్టీసీ బస్సులో ఏడు తులాల బంగారు ఆభరణాల బ్యాగుతో బయలుదేరాడు. తొర్రూరులో ప్రయాణీకుల హడావుడి మధ్య బస్సులోనే బ్యాగ్‌ మరిచిపోయి బస్సు దాగారు. బస్టాండ్‌ నుంచి బస్సు వెళ్లిపోయిన కొంత సమయం తరువాత బ్యాగ్‌ మరిచిపోయిన విషయాన్ని గుర్తు చేసుకొని ఒక్కసారిగా కంగుతిన్నారు.
బ్యాగ్‌ పోయిందని భావించిన అనిల్‌ జరిగిన పొరపాటును తన మిత్రులకు తెలియజేశారు. ఈ విషయం కాస్తా మరిపెడ పోలీసులకు చేరింది. విషయం తెలుసుకున్న పోలీసులు స్థానిక ఆర్టీసీ బస్టాండ్‌లోకి వెళ్లి ఆయన వచ్చిన బస్సులో వెతికి బ్యాగ్‌ను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం సదరు వ్యక్తికి సమాచారం అందించారు. రూ.2.70లక్షల విలువ గల బంగారు ఆభరణాల బ్యాగును సదరు వ్యక్తికి ఎస్సై అనిల్ అప్పగించారు.

నిజాయితీ చాటుకున్న పోలీసు
Last Updated : Dec 30, 2019, 11:13 AM IST

ABOUT THE AUTHOR

...view details