తెలంగాణ

telangana

ETV Bharat / state

డోర్నకల్​లో పోలీసుల నిర్భంద తనిఖీలు

మహబూబాబాద్ డోర్నకల్​లో పోలీసులు నిర్భంద తనిఖీలు నిర్వహించారు. సరైన పత్రాలు లేని వాహనాలు, అక్రమంగా విక్రయిస్తున్న మద్యం, గుట్కా స్వాధీనం చేసుకున్నారు.

By

Published : Aug 20, 2019, 1:16 PM IST

Updated : Aug 20, 2019, 1:54 PM IST

శాంతి డోర్నకల్​లో పోలీసుల నిర్భంద తనిఖీలు

భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని జిల్లా ఎస్పీ నంద్యాల కోటిరెడ్డి అన్నారు. మహబూబాబాద్‌ జిల్లా డోర్నకల్‌ మండల కేంద్రంలో నిర్భంద తనిఖీలు నిర్వహించారు. త్వరలో పురపాలక సంఘం ఎన్నికలు జరుగనున్నందున ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలు జరుగకుండా ప్రజలకు శాంతిభద్రతలపై నమ్మకం కలిగించేందుకు తనిఖీలు చేపట్టినట్లు తెలిపారు. సరైన పత్రాలు లేని 33 ద్విచక్ర వాహనాలు, 2 ఆటోలు, లక్ష రూపాయల విలువైన మద్యం, బెల్లం, పటిక, నాటుసారాయి, 10 వేల విలువైన గుట్కా స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. అక్రమ దందాలకు పాల్పడే వారు తమ పద్దతి మార్చుకోకపోతే కవాలన్నారు. లేని యెడల బాధ్యులైన వారిపై కేసులతో పాటు కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.

శాంతి డోర్నకల్​లో పోలీసుల నిర్భంద తనిఖీలు
Last Updated : Aug 20, 2019, 1:54 PM IST

ABOUT THE AUTHOR

...view details