కరోనాతో మృతి చెందిన ఓ అనాథ మృతదేహానికి పోలీసులు అంత్యక్రియలు నిర్వహించారు. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో చోటుచేసుకుంది. మహబూబాబాద్ పట్టణంలో మూడు రోజుల కిందట ఓ అనాథవృద్ధురాలు మృతి చెందింది. ఆమె మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రిలోని మార్చురికీ తరలించారు.
అనాథ శవానికి అంత్యక్రియలు - Police conducted a funeral for the orphaned body
కరోనా వచ్చిందని తెలిస్తే చాలు... కన్నవారు.. నా అనే వారు దూరంగా, భారంగా భావిస్తున్న రోజులు ఇవీ.. అలాంటిది దిక్కు మెక్కులేని ఓ అనాథ శవానికి మేమున్నామంటూ అంత్యక్రియలు చేసి పోలీసులు మానవత్వాన్ని చాటుకున్నారు. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో చోటుచేసుకుంది.
అనాథ శవానికి అంత్యక్రియలు
ఎవరైనా తెలిసినవారు, బంధువులు వస్తారని మూడు రోజుల పాటు ఎదురు చూశారు. ఎవరూ రాకపోవటంతో.. సీఐ వెంకటరత్నం ఆధ్వర్యంలో పోలీస్ సిబ్బంది పట్టణ శివారులోని శ్మశాన వాటికలో అంత్యక్రియలు నిర్వహించారు. ఈ దృశ్యాలను చూసిన స్థానికులు పోలీసులకు ధన్యవాదాలు తెలిపారు.
ఇదీ చదవండి:రాగల మూడ్రోజులు ఒకట్రెండు చోట్ల వర్షాలు