మహబూబాబాద్ నుంచి మహారాష్ట్రకు అక్రమంగా తరలిస్తున్న 275 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నలుగురిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు జిల్లా ఎస్పీ కోటిరెడ్డి తెలిపారు. మరో ఐదుగురు పరారీలో ఉన్నారని.. వారిని కూడా త్వరలో పట్టుకుంటామన్నారు.
మహబూబాబాద్‌లో అక్రమ రేషన్ బియ్యం పట్టివేత - మహబూబాబాద్ జిల్లా
రేషన్ బియ్యాన్ని కిలోకు 10 నుంచి 15 రూపాయల చొప్పున కొనుగోలు చేస్తారు. ఇతర రాష్ట్రాలకు అక్రమంగా తరలించి.. 30 రూపాయల చొప్పున అమ్మి లాభాలు గడిస్తారు. అంతేకాకుండా లెవీ ద్వారా ప్రభుత్వానికే విక్రయిస్తున్నా ఓ ముఠాను మహబూబూబాద్‌లో పోలీసులు పట్టుకున్నారు.
మహబూబాబాద్‌లో అక్రమ రేషన్ బియ్యం పట్టివేత
మహబూబాబాద్‌లోని వేణుమాధవ్ ఇండస్ట్రీస్ యజమాని లక్కా వెంకటేశ్వర్లు, మరో ఎనిమిది మంది ఒక ముఠాగా ఏర్పడి.. రేషన్ డీలర్ల వద్ద కేజీ బియ్యాన్ని 10 నుంచి 15 రూపాయల చొప్పున కొనుగోలు చేస్తారు. అనంతరం యానాం, మహారాష్ట్ర తదితర రాష్ట్రాలతో పాటు ప్రభుత్వానికి కూడా లెవీ ద్వారా 25 నుంచి 30 రూపాయల చొప్పున విక్రయిస్తున్నట్లు కోటిరెడ్డి పేర్కొన్నారు. నిందితులపై పీడీ యాక్ట్ నమోదు చేశామని వెల్లడించారు.