తెలంగాణ

telangana

ETV Bharat / state

100 క్వింటాళ్ల నల్లబెల్లం పట్టివేత - 100 క్వింటాళ్ల నల్లబెల్లం పట్టివేత

మహబూబాబాద్​ జిల్లా మెుగిలిచర్ల స్టేజీ వద్ద పోలీసులు లారీలో తరలిస్తున్న 100 క్వింటాళ్ల నల్లబెల్లం, 2క్వింటాళ్ల పటికను పోలీసులు పట్టుకున్నారు. నిందితుల్లో ముగ్గురిని అరెస్టు చేయగా... మరో ముగ్గురు పరారీలో ఉన్నారు.

police caught black jaggary in mahabubabad district
100 క్వింటాళ్ల నల్లబెల్లం పట్టివేత

By

Published : Dec 24, 2019, 10:18 PM IST

మహబూబాబాద్‌ జిల్లా కురవి మండలం మొగిలిచర్ల స్టేజీ వద్ద పోలీసులు వాహనాల తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం చిత్తూరు జిల్లా నుంచి కురవి మండలం బలపాలకు వెళ్తున్న లారీని పోలీసులు తనిఖీ చేశారు. లారీలో తరలిస్తున్న 200 బస్తాల్లో ఉన్న 100 క్వింటాళ్ల నల్లబెల్లం, 2 క్వింటాళ్ల పటికను స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన బెల్లం విలువ సుమారు రూ.8.16 లక్షలు ఉంటుందని పోలీసులు తెలిపారు. మహబూబాబాద్‌కు చెందిన భూక్యా సురేష్‌ ఓంజీ, మాలోతు రమేష్, భద్రు, శ్రీను, భూక్యా రెడ్డి, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వడ్డె మధు, మోపూరి సామేల్​పై కేసు నమోదు చేశారు. వీరిలో ముగ్గురిని అరెస్టు చేయగా... మిగతా నలుగురు పరారీలో ఉన్నట్లు ఎస్పీ తెలిపారు. చిత్తూరులో కేజీకి రూ.25 చొప్పున కొనుగోలు చేసి... జిల్లాలో కేజీకి రూ.80 చొప్పున విక్రయిస్తూ డబ్బు సంపాదనకు అలవాటు పడ్డారని తెలిపారు.

100 క్వింటాళ్ల నల్లబెల్లం పట్టివేత

ABOUT THE AUTHOR

...view details