మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి మండలం పెద్ద ముప్పారంలో పేకాట స్థావరంపై పోలీసులు దాడి చేశారు. గ్రామ శివారులోని ఓ తోటలో భారీ ఎత్తున పేకాట ఆడుతుండగా ఒక్కసారిగా అక్కడికి వెళ్లారు. 12 మందిని అదుపులోకి తీసుకున్నారు. ఒక కారు, మూడు ద్విచక్ర వాహనాలు, ఒక ఆటో, ఐదు సెల్ఫోన్లు, రూ.31 వేల నగదు స్వాధీనం చేసుకున్నట్టు ఎస్సై వెంకన్న తెలిపారు. 12 మందిపై కేసు నమోదు చేశారు.
పేకాట స్థావరాలపై పోలీసుల దాడి - Crime News
మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి మండలంలో పేకాట స్థావరాలపై పోలీసులు దాడి చేశారు. మండలంలోని పెద్దముప్పారం గ్రామ శివారులోని ఓ తోటలో భారీ ఎత్తున పేకాట ఆడుతున్నట్టు సమాచారం అందుకున్న పోలీసులు పక్కా సమాచారంతో దాడి చేశారు.
పేకాట స్థావరాలపై పోలీసుల దాడి