మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం తేజావత్ సింగ్ తండాలో ఆత్మహత్య చేసుకున్న బోడ సునీల్ అంత్యక్రియలకు వెళ్తున్న తెజస అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరామ్‌ను కేసముద్రం మండలం కాట్రపల్లి శివారులో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేసముద్రం పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
కోదండరామ్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు - telangana varthalu
తెజస అధినేత కోదండరామ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సునీల్‌నాయక్ అంత్యక్రియలకు వెళ్తుండగా ఆయను అడ్డుకుని పీఎస్‌కు తరలించారు.

కోదండరామ్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు
రాష్ట్రంలో అంత్యక్రియలకు పోయే స్వేచ్ఛ కూడా లేకుండా పోయిందని కోదండరామ్ మండిపడ్డారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌పై హత్యానేరం కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీకి క్యాలెండర్ ప్రకటించాలన్నారు. సునీల్ కుటుంబ సభ్యుల న్యాయమైన కోరికలను తీర్చాలని డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి: బండి సంజయ్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు
Last Updated : Apr 3, 2021, 1:12 AM IST