తెలంగాణ

telangana

ETV Bharat / state

ప్రణబ్​ మృతికి సంతాపంగా సర్వసభ్య సమావేశం వాయిదా - మహబూబాబాద్​ జిల్లా తాజా వార్తలు

మహబూబాబాద్‌ జిల్లా కురవిలోని మండల పరిషత్​ కార్యాలయంలో సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ రాష్ట్రపతి ప్రణబ్​ ముఖర్జీకి నివాళులు అర్పించారు.

Plenary session adjourned to mourn Pranab's death
ప్రణబ్​ మృతికి సంతాపంగా సర్వసభ్య సమావేశం వాయిదా

By

Published : Sep 3, 2020, 12:25 PM IST

మహబూబాబాద్‌ జిల్లా కురవిలోని మండల పరిషత్​ కార్యాలయంలో సర్వసభ్య సమావేశం నిర్వహించారు. డోర్నకల్​ ఎమ్మెల్యే రెడ్యానాయక్​ హాజరయ్యారు. ఈ సందర్భంగా భారతరత్న, మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. కాసేపు మౌనం పాటించారు. మృతికి సంతాపంగా సర్వసభ్య సమావేశాన్ని వాయిదా వేశారు.

దేశ అభ్యున్నతికి ప్రణబ్​ ముఖర్జీ ఎంతో కృషి చేశారని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఆయన సేవలు మరువలేనివని కొనియాడారు.

ఇదీచూడండి.. వర్షాకాల సమావేశాలపై కేసీఆర్ సమీక్ష

ABOUT THE AUTHOR

...view details