తెలంగాణ

telangana

ETV Bharat / state

'ప్లాస్టిక్ నిర్మూలనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి'

మహబూబాబాద్  జిల్లా వ్యాప్తంగా ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించి పర్యావరణ పరిరక్షణకు పాటుపడాలని కోరుతూ... ఈనాడు-ఈటీవీ భారత్​ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.

'ప్లాస్టిక్ నిర్మూలనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి'

By

Published : Oct 1, 2019, 5:20 PM IST

ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించి పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని కోరుతూ మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ నియోజకవర్గం వ్యాప్తంగా ఈనాడు-ఈటీవీ భారత్ ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీలు నిర్వహించారు. దంతాలపల్లి, నర్సింహులపేట, మరిపెడ, కురవి, డోర్నకల్ మండలాల్లో వైద్య సిబ్బంది, కళాశాల విద్యార్థులు స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో ర్యాలీలు తీశారు. దంతాలపల్లిలో వరంగల్-ఖమ్మం రాష్ట్ర రహదారిపై మానవహారం నిర్వహించారు. పర్యావరణానికి పెను ముప్పుగా మారిన ప్లాస్టిక్ వినియోగాన్ని పూర్తిగా తగ్గించాలని కోరుతూ నినాదాలు చేశారు. ప్లాస్టిక్ నిర్మూలనకు అందరూ కృషి చేయాలని పలువురు వక్తలు కోరారు.

'ప్లాస్టిక్ నిర్మూలనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి'

ABOUT THE AUTHOR

...view details