మిషన్ భగీరథ పైపులైన్‌ను రైల్వే ట్రాక్‌ను దాటించే పనులను కాంట్రాక్టర్ ఇష్టారాజ్యంగా చేయడం వల్ల రైల్వే పట్టాల పక్కన కుంగిపోయి గొయ్యి ఏర్పడిన సంఘటన మహబూబాబాద్ జిల్లా రైల్వేస్టేషన్ సమీపంలో చోటు చేసుకుంది. 435/26-28 మైలురాయి వద్ద మిషన్ భగీరథ పైపులు రైల్వే ట్రాక్ క్రింద నుంచి వేసిన సమయంలో సరైన ప్రమాణాలు పాటించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించారు.
మహబూబాబాద్ రైల్వేస్టేషన్ సమీపంలో ట్రాక్ పక్కన ఏర్పడిన గొయ్యి.. - mahabubabad district news
మహబూబాబాద్ రైల్వేస్టేషన్ సమీపంలో రైల్వే ట్రాక్ పక్కన కుంగిపోయి గొయ్యి ఏర్వడింది. రైల్వే ఉద్యోగి సకాలంలో గుర్తించి ఉన్నతాధికారులకు సమాచారం అందించగా... అధికారులు అక్కడకు చేరుకుని చర్యలు చేపట్టారు.

మహబూబాబాద్ రైల్వేస్టేషన్ సమీపంలో ట్రాక్ పక్కన ఏర్పడిన గొయ్యి..
దీంతో వర్షాకాలంలో తీవ్రంగా పడిన వర్షాలతో రైలు పట్టాల ప్రక్కన కంకర కుంగి గొయ్యి ఏర్పడి.... ప్రమాదకరంగా మారింది. దీన్ని కీమెన్‌గా విధులు నిర్వహిస్తున్న సాంబమూర్తి అనే రైల్వే ఉద్యోగి సకాలంలో గుర్తించి ఉన్నతాధికారులకు సమాచారమందించారు. వెంటనే అధికారులు స్పందించి తక్షణమే ప్రమాదం జరగకుండా చర్యలు తీసుకున్నారు.
ఇవీ చూడండి: ఔరా... వాగు దాటి వైద్యం చేసిన ఏజెన్సీ అదనపు వైద్యాధికారి