భారీ వర్షాలతో మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ నియోజకవర్గంలో వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. పాలేరు, ఆకేరు, మున్నేరు వాగుల్లో వరద ఉద్ధృతి కొనసాగుతోంది. దాదాపుగా అన్ని మండలాల్లోని చెరువులు అలుగులు పారుతున్నాయి. చెరువుల వద్దకు చేపలు పట్టేందుకు ప్రజలు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు.
పొంగిపొర్లుతున్న వాగులు,వంకలు... చెరువుల్లో చేపలవేట కోలాహలం - rains in telangana
డోర్నకల్ నియోజకవర్గంలో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. చెరువులన్నీ అలుగులు పారుతున్నాయి. దంతాలపల్లి మండలం కుమ్మరికుంట్ల చెరువులో చేపలు పట్టేందుకు స్థానికులు భారీగా తరలివచ్చారు.
పొంగిపొర్లుతున్న వాగులు,వంకలు... చెరువుల్లో చేపలవేట కోలాహలం
దంతాలపల్లి మండలం కుమ్మరికుంట్ల చెరువు జనసంద్రంగా మారింది. ప్రజలంతా చేపల వేటలో నిమగ్నమయ్యారు. నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో వరద ఉద్ధృతి వల్ల పంట పొలాలు నీటిలో మునిగిపోయాయని రైతులు ఆందోళన చెందుతున్నారు. మరో రెండు రోజులు వర్షాలు ఉన్నాయని వాతావరణ శాఖ తెలపడంతో రైతులు భయాందోళనకు గురవుతున్నారు.
ఇవీ చూడండి: జీహెచ్ఎంసీ అధికారుల తీరుపై మంత్రి కేటీఆర్ ఆగ్రహం