పెండింగ్ వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ.. మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లిలోని మండల విద్యా వనరుల కేంద్రం ఎదుట విద్యా వాలంటీర్ల సంఘం ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు. బకాయి వేతనాలు చెల్లించాలని నినాదాలు చేశారు. గత విద్యా సంవత్సరానికి సంబంధించిన మూడు నెలల బకాయి వేతనాలు తక్షణమే విడుదల చేయాలని విద్యా వాలంటీర్ల సంఘం జిల్లా అధ్యక్షుడు విజయేందర్ అన్నారు. అనంతరం వినతిపత్రాన్ని అధికారులకు అందజేశారు.
బకాయి వేతనాలు చెల్లించండి - valanteer
మూడు నెలల బకాయి వేతనాలు తక్షణమే విడుదల చేయాలని మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లిలో విద్యా వాలంటీర్లు ధర్నా చేపట్టారు.

వేతనాలు చెల్లించండి