మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలంలో రైతులకు పట్టాదారు పాసుపుస్తకాలను ఎమ్మెల్యే శంకర్ నాయక్ పంపిణీ చేశారు. అనంతరం లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ చెక్కులను అందించారు. రైతుల సంక్షేమం కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ అనేక పథకాలను అమలు చేస్తున్నారన్నారు.
రైతులకు పాసుపుస్తకాలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే శంకర్ నాయక్ - కేసముద్రం
రైతుల సంక్షేమమే ధ్యేయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ పనిచేస్తున్నారని మహబూబాబాద్ ఎమ్మెల్యే శంకర్ నాయక్ అన్నారు. జిల్లాలోని కేసముద్రం మండలంలో వివిధ గ్రామాల రైతులకు పాసుపుస్తకాలు పంపిణీ చేశారు. రాష్ట్రంలో ప్రజల సంక్షేమం కోసం సీఎం అనేక పథకాలను అమలు చేస్తున్నారని తెలిపారు.
రైతులకు పాసుపుస్తకాలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే శంకర్ నాయక్
రైతు బంధు, బీమా వంటి అనేక పథకాల అమలులో దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నారని అన్నారు. గత ప్రభుత్వాలు రైతుల నుంచి డబ్బులు వసూలు చేశారని, కానీ మన ప్రభుత్వం పంట పెట్టుబడిని అందించి రైతు పక్షపాతిగా నిలిచిందన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు, తెరాస నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.