మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి ఎంపీడీవో కార్యాలయం ముందు పంచాయతీ కార్యదర్శులు నిరసన తెలియజేశారు. తమపై పనిభారాన్ని తగ్గించాలంటూ మండల పరిషత్ కార్యాలయం ఎదుట నినాదాలు చేశారు. ఉపాధి హామీ పనులను తమకు అప్పగించవద్దంటూ ఎంపీడీవోకు వినతిపత్రం అందజేశారు.
పనిభారం తగ్గించాలని పంచాయతీ కార్యదర్శుల నిరసన - మహబూబాబాద్ జిల్లా సమాచారం
తమపై పనిభారాన్ని తగ్గించాలంటూ మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లిలో పంచాయతీ కార్యదర్శులు నిరసన వ్యక్తం చేశారు. ఉపాధి హామీ పనులు తమకు అప్పగించవద్దంటూ ఎంపీడీవోకు వినతిపత్రం సమర్పించారు.
పనిభారం తగ్గించాలంటూ పంచాయతీ కార్యదర్శుల నిరసన
తమకు సరైన సమయపాలన లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. సాధారణ సెలవు దినాల్లో విధులకు హాజరవుతున్నామని వాపోయారు. తమ పెండింగ్ సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఎంపీడీవో గోవిందరావును కోరారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శులు వెంకటేశ్వర్లు, రామస్వామి, శ్రీనివాస్, ఎస్.రమేశ్, లక్ష్మీకాంత్ పాల్గొన్నారు.