మహబూబాబాద్ జిల్లా డోర్నకల్‌కు చెందిన యశోదజైన్... పక్కింట్లోకి కట్ల పాము వచ్చింది. దానిని పట్టుకుని డబ్బాలో పెట్టుకుని ఊరి చివరలో వదిలిపెట్టేందుకు ఆక్టివా బండిపై ఇంటి నుంచి బయలు దేరాడు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తూ పాము డబ్బా నుంచి బయటకొచ్చి సీటు కిందకు వెళ్లింది. ఎంత ప్రయత్నించినప్పటికీ పాము మాత్రం బయటకు తీయలేక పోయారు. చేసేదేమీ లేక పక్కనే ఉన్న మెకానిక్ వద్దకు వెళ్లాడు. ద్విచక్ర వాహనాన్ని స్టార్ట్ చేసి రేస్ ఎంత పెంచినప్పటికీ పాము జాడ లభించలేదు. చివరకు బండి సామాన్లు ఒక్కొక్కటిగా తొలగించారు. అప్పుడుబయటకొచ్చిన పామును కర్రల సాయంతో హతమార్చారు.
ద్విచక్రవాహనంలో పాము.. తీసేందుకు నానా తంటాలు.. - మహబూబాబాద్ జిల్లా
ఇక్కడ కనిపిస్తున్న ద్విచక్ర వాహనాన్ని చూడండి. ఆక్టివా వాహనం ఏదో ప్రమాదానికి గురై పూర్తిగా దెబ్బతిన్నట్లుంది అనుకుంటే మీరు పొరబడినట్లే. ద్విచక్ర వాహనంలో చొరబడిన పామును బయటకు రప్పించేందుకు బండి గుళ్లయిన సంఘటన ఇది.
ద్విచక్రవాహనంలో పాము..