తెలంగాణ

telangana

ETV Bharat / state

RAIN: వర్షాలతో చెరువుల్లా మారిన కొనుగోలు కేంద్రాలు

ఉదయం నుంచి కురుస్తున్న వర్షాలతో కొనుగోలు కేంద్రాల్లోని వరిధాన్యం తడిసి ముద్దయింది. పెద్దఎత్తున వర్షపు నీరు చేరడంతో చెరువులను తలపించాయి. మహబూబాబాద్ జిల్లాకేంద్రంలో రెండు గంటలకుపైగా వాన కురవడంతో మార్కెట్లు, రహదారులన్నీ జలమయమయ్యాయి.

Paddy damaged at buying centres
చెరువుల్లా మారిన కొనుగోలు కేంద్రాలు

By

Published : Jun 3, 2021, 3:50 PM IST

మహబూబాబాద్ జిల్లావ్యాప్తంగా కురిసిన వర్షానికి కొనుగోలు కేంద్రాలు చెరువుల్లా మారాయి. భారీ వర్షానికి వరిధాన్యం తడిసి ముద్దయింది. జిల్లా కేంద్రంలో సుమారు రెండు గంటలకు పైగా వాన కురవడంతో కాలువలు ఉప్పొంగి ప్రవహించాయి.

పట్టణంలోని కూరగాయల మార్కెట్​లోకి వర్షపు నీరు చేరడంతో వ్యాపారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కొనుగోలు కేంద్రాల్లో వరిధాన్యం కుప్పలు తడిసిపోవడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. ధాన్యాన్ని ప్రభుత్వమే మద్దతు ధరతో కొనుగోలు చేయాలని అన్నదాతలు కోరుతున్నారు.

ఇదీ చూడండి:కేరళకు నైరుతి రుతుపవనాలు- జోరుగా వర్షాలు

ABOUT THE AUTHOR

...view details