తెలంగాణ

telangana

ETV Bharat / state

అభివృద్ధి పేరిట మా భూములనే లాక్కుంటున్నారు : మందకృష్ణ మాదిగ - mahabubabad district latest News

మహబూబాబాద్ జిల్లా కలెక్టరేట్ సమీపంలో ఎమ్మార్పీఎస్ రిలే నిరాహార దీక్ష శిబిరాన్ని మందకృష్ణ మాదిగ సందర్శించారు. ఎస్సీల భూములను బలవంతంగా గుంజుకోవడాన్ని నిరసిస్తూ జరుగుతున్న కార్యక్రమానికి సంఘీభావం తెలిపారు.

అభివృద్ధి పేరిట మా భూములనే లాక్కుంటున్నారు : మందకృష్ణ మాదిగ
అభివృద్ధి పేరిట మా భూములనే లాక్కుంటున్నారు : మందకృష్ణ మాదిగ

By

Published : Sep 4, 2020, 10:37 PM IST

మహబూబాబాద్ జిల్లా కలెక్టరేట్ సమీపంలో ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన రిలే నిరాహార దీక్ష శిబిరాన్ని మందకృష్ణ మాదిగ సందర్శించారు. ఎస్సీల భూములను బలవంతంగా లాక్కోవడాన్ని నిరసిస్తూ దీక్షకు మద్ధతు తెలిపారు.'

30 వేల ఎకరాలు ఇచ్చి లక్ష ఎకరాలు గుంజుకున్నారు'

ఎస్సీలకు 3 ఎకరాల భూమిని ఇస్తానని అధికారంలోకి వచ్చిన తెరాస సర్కార్, 6 ఏళ్లలో అదే ఎస్సీలకు చెందిన లక్షలాది ఎకరాల భూమిని బలవంతంగా లాక్కుందని మండిపడ్డారు. గడిచిన ఆరేళ్లలో కేసీఆర్ సర్కార్ ఏం చేసిందని ఆయన ఎద్దేవా చేశారు. దీక్షలో కూర్చున్న వారిని సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

అభివృద్ధి పేరిట మా భూములనే లాక్కుంటున్నారు : మందకృష్ణ మాదిగ

సీఎం సొంత జిల్లాలో...

ముఖ్యమంత్రి కేసీఆర్ సొంత జిల్లాతో సహా రాష్ట్రంలోని అన్ని గ్రామాల్లో నిర్మిస్తున్న స్మశాన వాటికలు, డంపింగ్ యార్డ్​లు, నర్సరీలు, ఐకేపీ భవనాలను ఎస్సీ భూముల్లో నిర్మిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. తెరాస అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఎస్సీలకు 30 వేల ఎకరాల భూములను పంచారని తెలిపారు. అదే సమయంలో లక్ష ఎకరాల భూమిని ఎస్సీల నుంచి బలవంతంగా లాక్కున్నారని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.

అభివృద్ధి పేరిట మా భూములనే లాక్కుంటున్నారు : మందకృష్ణ మాదిగ

ప్రభుత్వానికి తెలిపేందుకే...

తమ నిరసనను ప్రభుత్వానికి తెలియజేసేందుకే ఈ దీక్షలను చేపట్టామని మందకృష్ణ స్పష్టం చేశారు. క్రమ క్రమంగా ఈ దీక్షలను మండలాలు... గ్రామాలకు విస్తరిస్తామన్నారు.

ఇవీ చూడండి : జీహెచ్​ఎంసీ ఎన్నికల్లో గెలిచేందుకు భాజపా ప్రణాళికలు

ABOUT THE AUTHOR

...view details