తాటి ముంజల కోసం ఓ యువకుడు తాటిచెట్టు పైకెక్కి ప్రమాదవశాత్తూ కింద పడి మృతి చెందిన ఘటన మహబూబాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది. నర్సింహులపేట మండలం రూప్లాతండా శివారు బిల్యాతండాకు చెందిన లకావత్ సురేష్(21) అనే యువకుడు తండా శివారులోని తాటివనానికి వెళ్లాడు. తాటి ముంజల కోసం ఓ తాటిచెట్టెక్కాడు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తూ కాలు జారి చెట్టు పైనుంచి కింద పడ్డాడు.
ఉసురు తీసిన తాటి ముంజల ఆశ - one young man died
తాటి ముంజల కోసం వెళ్లి ప్రమాదవశాత్తూ చెట్టు పైనుంచి కిందపడి ఓ యువకుడు మృతి చెందిన ఘటన మహబూబాబాద్ జిల్లా బిల్యా తండాలో జరిగింది. అతని మృతితో తండాలో విషాదఛాయలు అలుముకున్నాయి.
ఉసురు తీసిన తాటి ముంజల ఆశ
దీంతో తీవ్ర గాయాలపాలైన అతడిని వైద్యం కోసం ఖమ్మంకు తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. కుమారుడి మృతితో తల్లిదండ్రులు రోదించిన తీరు తండావాసులను కంటతడి పెట్టించింది. మృతుడి కుటుంబాన్ని ఎమ్మెల్యే రెడ్యానాయక్ పరామర్శించారు.
ఇవీ చూడండి: తండ్రి అంత్యక్రియలకు వెళ్తుండగా ప్రమాదం