తెలంగాణ

telangana

ETV Bharat / state

తొర్రూరులో లక్ష విత్తన బంతుల తయారీ

మహబూబాబాద్​ జిల్లా తొర్రూరులో వందేమాతరం ఫౌండేషన్​ ఆధ్వర్యంలో లక్ష విత్తన బంతులను తయారు చేశారు. ఈ నెల 20న వాటిని చల్లనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.

one lakh seed balls Have been made in Thorrur in mahabubabad
తొర్రూరులో లక్ష విత్తన బంతుల తయారీ

By

Published : Jun 15, 2020, 2:08 PM IST

మహబూబూబాద్ జిల్లా తొర్రూరు డివిజన్ కేంద్రంలోని నితిన్ భవన్​లో వందేమాతరం ఫౌండేషన్ ఆధ్వర్యంలో లక్ష విత్తన బంతులను తయారు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారంలో భాగంగా ఈనెల 20న తొర్రూరు కేంద్రంగా ఈ విత్తన బంతులను చల్లుతామని ఫౌండేషన్​ నిర్వాహకులు రవీందర్ తెలిపారు.

కౌన్సిల్​ ఫర్​ గ్రీన్​ రెవెల్యూషన్​ వారి సహకారంతో నితిన్​ భవన్​ విద్యార్థులు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు రవీందర్​ పేర్కొన్నారు. అడవి జాతికి చెందిన వేప, మారేడు, జువ్వి, జమ్మి, బొగడ వంటి 30 రకాల విత్తనాలతో వీటిని తయారు చేసినట్లు వివరించారు. జాతీయ రహదారి, కొండలు, గుట్టలు, చెరువు గట్లపై వీటిని విత్తనున్నట్లు తెలిపారు.

ఇదీచూడండి: కేసీఆర్ వడ్డీ వ్యాపారిలా వ్యవహరిస్తున్నారు: బండి సంజయ్

ABOUT THE AUTHOR

...view details